18 May, 2026 | 3:29 AM

పోలీసుల స్పెషల్ డ్రైవ్

18-05-2026 02:27 AM

నెంబర్ ప్లేట్ లేని వాహనాల సీజ్

గాంధారి, మే 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పోలీసులు స్థానిక ఎస్‌ఐ మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా  నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్టు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను తిప్పితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. నిబంధనలు పాటించని పలు వాహనదారులకు జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు.