బ్రిలియంట్ విద్యార్థుల విజయకేతనం
బూర్గంపాడు,మే17,(విజయక్రాంతి): ఆదివారం ప్రకటించిన ఎప్ సెట్ ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థుల విజయకేతనం ఎగురవేశారు.ఇంజనీరింగ్ విభాగంలో పి. జయంత్ రెడ్డి 1498వ ర్యాంక్, పి.చంద్ర శేఖర్ 22110వ ర్యాంక్, బి.ఏ.వీ.ఎస్.మణికంఠ 24278వ ర్యాంక్, ఎన్.వీ.ఎస్ గణేష్ 27854వ ర్యాంకులు సాధించగా, అగ్రికల్చర్ విభాగంలో వై.వినీత 18534వ ర్యాంక్ , జి.తణ్మయి శ్రీ 25205 ర్యాంక్, పి.నాగజ్యోతి 26693 ర్యాంకులతో ముందంజలో నిలిచి బ్రిలియంట్ విద్యార్థులు మరొకసారి సారపాక కీర్తి కిరీటాన్ని రాష్ట్ర స్థాయిలో నిలిపారు.
ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డా.బిఎన్‌ఆర్ మాట్లాడుతూ.. గ్రామీణ ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు బ్రిలియంట్ కాలేజ్ నందు ఎప్ సెట్ కోచింగ్ తీసుకుని 99 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఎప్ సెట్ ఫలితాల్లో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బిఎన్‌ఆర్ మెమెంటో ఇచ్చి అభినందనలు తెలిపారు.మంచి ఫలితాలను సాధించేందుకు సహకరించిన తల్లిదండ్రులకు,అధ్యాపకులకు ఆయన ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.






