4 August, 2026 | 3:35 AM

ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

04-08-2026 01:14 AM
  1. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితుల డిమాండ్
  2. ప్లాంటు ఎదుట ఆందోళన 
  3. పొలాలు పోయి పూట గడువడం లేదు
  4. జీవనాధారమైన భూములు లాక్కున్నారని ఆవేదన

దామరచర్ల, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్లాంట్ నిర్మాణ సమయంలో తమకు ఇచ్చి న హామీ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పి ంచాలని కోరుతూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట సోమవారం భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. వీర్ల పాలెం, తాళ్ల వీరప్పగూడెం, నర్సాపురం, శాంతి నగర్, తిమ్మాపుర, దుబ్బతండా, సాత్ తండా, తూర్పు తండాలకు చెందిన భూ నిర్వాసితులు ఆందోళనలో పాల్గొన్నారు.

ప్లాంట్ నిర్మాణ సమయంలో తమ కబ్జాలో ఉన్న భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎంతో కాలంగా తమ స్వాధీనంలో ఉన్న భూముల ను లాక్కోవడం దారుణం అన్నారు. నిరుపేదలమైన తాము తాత తండ్రుల నుంచి వార సత్వంగా వచ్చిన ఈ భూములపై ఆధారపడి జీవనం కొనసాగించామని చెప్పారు. ఆ భూములను స్వాధీనం చేసుకునే సమయంలోనే తమను అన్నివిధాలుగా ఆదుకోవడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

ప్లాంట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయినా అధికారులు తమ గురించి పట్టించుకోవడం లేదని వాపోయారు. పొ లాలు పోయి పూట గడవక తీవ్ర ఇబ్బందు లు పడుతున్నట్టు వాపోయారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని కన్నీరు మున్నీరుగా విల పించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి స మస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు. భూ నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో పవర్ ప్లాంట్ ఎదుట భారీ గా పోలీసులను మోహరించారు. 

మద్దతు ప్రకటించిన పార్టీలు 

భూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనకు సీపీఎం, బీజేపీ నేతలు తమ మద్దతును ప్రకటించారు. నిర్వాసితులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నినదించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి వినోద్, పాపా నాయక్, ఎర్రా నాయక్, దయానంద్, జానికి రెడ్త్ తదితరులు పాల్గొన్నారు.