డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల విస్తృత తనిఖీలు
07-06-2026 02:57 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నార్కోటిక్ లో ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కోటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో అన్ని షాపులు, పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మాదకద్రవ్యాల నిర్మూలనకే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ డాగ్‌కు మత్తు పదార్థాల వాసనను పసిగట్టి, వాటిని సులభంగా గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగిన తక్షణమే పోలీస్ శాఖకు తెలియపరచాలని కోరారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






