కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష పదవికి జోరుగా పైరవీలు
* అప్పాజీపల్లి సర్పంచ్ వైపే అందరి చూపు
కొల్చారం,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల శాఖ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు జోరుగా తమ వంతు పైరవీలు సాగిస్తున్నారు. ఒక్కో నాయకుడు పార్టీ మండల శాఖ అధ్యక్ష పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు అప్పాజీపల్లి సర్పంచ్ గజినీ వెంకట్ గౌడ్ తో పాటు ప్రస్తుత అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్, పైతరకు చెందిన సీనియర్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. గత పది సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోవడంతో ఆయనను మార్చాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.
నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉండడంతో ప్రస్తుత అధ్యక్షులు కేవలం రాజిరెడ్డి వర్గం వ్యక్తిగా గుర్తింపు పొందారు. దీంతో జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి లకు మింగుడు పడడం లేదు. ఒంటెద్దు పోకడలతో ఒక వర్గానికే ప్రాధాన్యతనిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడిని మార్చాలని జిల్లా అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే వ్యక్తి గుర్తింపు పొందడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండే అప్పాజీపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ వైఫై అందరూ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
అధ్యక్ష పదవి రైస్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇచ్చి మండల పార్టీ అధ్యక్షుడిగా వెంకట గౌడ్ ను నియమించడానికి జిల్లా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వెంకట్ గౌడ్ కు పదివి ఇస్తే యువకులంతా ఏకతాటి పైకి వచ్చి రానున్న మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల్లో బహిరంగంగానే వెల్లడిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుల చెపుతుండడం విశేషం.






