3 August, 2026 | 1:19 AM

అమెరికాలో కమ్యూనిటీ సర్వీస్ అవార్డు అందుకున్న ఎమ్మెల్యే యెన్నం

03-08-2026 12:06 AM

మహబూబ్ నగర్ ఆగస్టు 2 (విజయక్రాంతి): అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి కమ్యునిటీ సర్వీస్ అవార్డును అమెరికా తెలుగు అసోసియేషన్ ఘనంగా ప్రదానం చేసింది. సమాజ సేవలో ముఖ్యంగా విద్యా రంగంలో ఆయన చూపిన అంకితభావం, దూరదృష్టి, కార్యాచరణకు గుర్తింపుగా ఈ అవార్డు అందించడం విశేషం.

ఈ అవార్డు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గౌరవం నాకు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ముఖ్యంగా పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడానికి మరింత కృషి చేస్తానని, విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యేకి ఈ అంతర్జాతీయ గౌరవం లభించడం పట్ల మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విద్యావంతులు, మేధావులు, సామాజిక వేత్తలు ఈ అవార్డును మహబూబ్ నగర్ ప్రజల గర్వకారణంగా అభివర్ణిస్తూ, ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు కేవలం వ్యక్తిగత గౌరవమే కాకుండా మహబూబ్ నగర్ విద్యా ప్రగతికి ప్రతీకగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వికాసానికి మార్గదర్శకంగా నిలిచే ఘట్టమని వారు అభిప్రాయపడ్డారు.