ఈ కేసులు.. తనిఖీలు.. ఇలాగే కొనసాగేనా..?
*అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
*ఐదుగురిపై కేసులు నమోదు, వాహనాలు సీజ్
*ఇదే తరహా తనిఖీలు చేపట్టాలి అంటున్న జనం
*అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు : కృష్ణ ఓబుల్ రెడ్డి, ఎస్‌ఐ, చిన్న చింత కుంట మండలం
చిన్న చింతకుంట ఆగస్టు 2 (విజయక్రాంతి): నాటి నుంచి నేటి వరకు ఏనాటి వరకు తెలియదు కానీ అక్రమ ఇసుక రవాణాకు మాత్రం అడ్డు లేకుండా పోతుంది అనే మాటలు మామూలే అవుతున్నాయి. ఈ తరుణంలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సొంత మండల కేంద్రంలోని సీసీ కుంట పరిధిలో అక్రమ ఇసుక రవాణా పై పోలీసులు ఉక్కు పాదం మోపెందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఎమ్మెల్యే సొంత గ్రామంలో పాఠశాల నిర్మాణం చేసేందుకు గాను రెండు భారత్ బెంజీలు ఇసుక డంపింగ్ చేస్తుండగా పోలీసులు ఆ విషయాన్ని గమనించి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించి ఆ వాహనాలపై సంబంధిత డ్రైవర్ల పై కేసులు నమోదు చేసిన సంఘటన జరగడంతో ఒక్కసారిగా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై దాడులు ఇలాగే కొనసాగుతాయా? కేవలం గింతవరకేనా అనే సందేహం కూడా నెలకొంటుంది. దీంతోపాటు మద్దూరు గ్రామ పరిధిలో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టడంతో మరో మూడు ఇసుక ట్రాక్టర్లు అదుపులోకి తీసుకొని వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్త్స్ర ఓబుల్ రెడ్డి స్పష్టం చేస్తుండ్రు.
అసలు అక్రమ ఇసుక ఆపుదల జరిగేనా?
ఎమ్మెల్యే సొంత గ్రామంలో డంపింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు దాడులు నిర్వహించి సంబంధిత వాహనాలతో పాటు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో ఒక్కసారి ఈ విషయంపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహంగా ఉన్నారా అని అనుమానం ఇసుక వ్యాపారులు వ్యక్తం చేస్తుండ్రు. ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ఇసుక వ్యాపారం చేయాలని ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు నిత్యం చెబుతుంటారు. ఈ తరుణంలో ఒకేరోజు ఐదు వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఐదుగురుపై కేసులు నమోదు కావడంతో ఈ వేగం మరింత ఉంటుందా? ఇక్కడి వరకే ఆగుతుందా? అనే ప్రశ్న లకు సమాధానం లభించినట్లేనా అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తుండ్రు.
అక్రమ ఇసుక వ్యాపారం మామూలే నా?
అక్రమ ఇసుక వ్యాపారం అనేది ఈనాటిది కాదు ఏనాటి నుంచి వస్తున్న ఆచారంగా ప్రజలు చెబుతున్న మాట. ఎప్పుడో ఎక్కడో ఒకచోట కేసులు నమోదు చేయడం ఆ తర్వాత ఇదంతా ఒక ప్రక్రియ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది అనేలా ఉండడంతో ఈ అక్రమ ఇసుక దందాకు అడ్డు పూర్తిస్థాయిలో పడడం లేదు. ఇదంతా మామూలే అనేలా అధికారులు ఉండకూడదని ఎన్నో నియమ నిబంధనలు అమలు చేస్తున్న అధికారులు ఈ అక్రమ ఇసుక దందపై ఎందుకు మౌనంగా ఉన్నారో అంత చిక్కని ప్రశ్నగా మారుతుందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. ఇప్పటి నుంచైనా ఎక్కడో ఒకచోట నిబంధనలు అమలు జరిగితే ఆ విధానం అంతా విస్తరిస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తుండ్రు. మరి సీసీ కుంట పోలీసులు ఈ తనిఖీలు యధావిధిగా కొనసాగిస్తారా లేదా వేచి చూడాలి.
5 వానలు సీజ్ కేసులు నమోదు...
మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో మూడు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలించడంతో వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. దమల్నాపూర్ గ్రామంలో రెండు భారత్ బెంజ్ లు ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువచ్చి డంపు చేస్తున్న సమయంలో గుర్తించి అనుమతి పత్రాలు చూపించని యెడల కేసులు నమోదు చేసి ఆ వాహనాలను కూడా సీజ్ చేశాం. అక్రమంగా ఎవరు కూడా ఇసుక వ్యాపారం చేయకూడదు నిబంధనలకు లోబడి ఇసుకను తరలింపు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అలాంటి వారికి పూర్తిస్థాయిలో సహకరిస్తాం.
కృష్ణ ఓబుల్ రెడ్డి ఎస్‌ఐ, చిన్న చింత కుంట మండలం, మహబూబ్ నగర్ జిల్లా






