2 August, 2026 | 6:17 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం

02-08-2026 04:58 PM

హైదరాబాద్‌: నగరంలోని  పలుచోట్ల ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండి సాయంత్రానికి వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, షేక్ పేట, గచ్చిబౌలి, టోలీచౌకి, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట,ఎమ్మెల్యే కాలనీ, మియాపూర్ తో పాటు పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం దంచి కొడుతోంది. ఒక్కసారిగా వర్షం పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. రోడ్లపైకి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి.