ముధోల్ ఎమ్మెల్యే పరామర్శ
02-08-2026 04:48 PM
కుబీర్ (విజయ క్రాంతి): ముధోల్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంతో పాటు కోతుల్‌గావ్, బుజ్జూర్, మేధన్‌పూర్, కుంటాల గ్రామాల్లో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ పరామర్శించారు.ఈ సందర్భంగా మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, ఉన్నారు.






