3 August, 2026 | 1:24 AM

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

03-08-2026 12:09 AM

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని బాలు యాదవ్ 

మహబూబ్ నగర్ అర్బన్ ఆగస్టు 2 : ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని బాలు యాదవ్ అన్నారు. ఆదివారం ఏనుగొండ రామదూత టౌన్షిప్ జిల్లా కార్యాలయంలో సంఘం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులాల్లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులు రాజకీయంగా, సామాజికంగా ఇంకా  వెనుకబడి ఉన్నారని, అందుకొరకే సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉన్నటువంటి యాదవ బంధువులలు పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హాస్టల్ భవనానికి హితోదికంగా ఆర్థిక సహకారం అందించి సహకరించాలని కోరారు.

వెనుకబడిన వారిని ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన తీసుకుంటూ ముందుకు సాగుదాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి వై రవికుమార్ యాదవ్, సంఘం జిల్లా అధ్యక్షులు జుర్రు నారాయణ,ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అంజన్న యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి గోదా తిరుపతయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.