జర్నలిస్టు, డైరెక్టర్లకు ఘన సన్మానం
ప్రత్యేకంగా అభినందించిన ముదిరాజ్ సంఘం నేతలు
గండీడ్ ఆగస్టు 2 (విజయక్రాంతి) : వెనుకబడిన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాలని మాజీ ఎంపీపీ లక్ష్మయ్య అన్నారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నంత పాఠశాలలో ఆదివారం జర్నలిస్టులు, సహకార సంఘం డైరెక్టర్లను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ లక్ష్మయ్య ముదిరాజ్ మాట్లాడుతూ అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లు మరింత ఐక్యతతో ముందుకు సాగి తమ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏదైనా సాధించగలిగే శక్తి ముదిరాజులకు ఉందని వెనుకబడిన ప్రతి ఒక్కరిని అభివృద్ధి వైపు తీసుకుపోయేందుకు జర్నలిస్టులతో పాటు డైరెక్టర్లు వివిధ హోదాలలో ఉన్న ముదిరాజ్ నేతలు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
తోటి వారికి సహాయం చేయాలని తపన ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆకాంక్ష ప్రతి మనిషిలో ఉంటే అందరూ ఉన్నత స్థాయికి చేరుకుంటారని స్పష్టం చేశారు. ఎప్పుడు ఇలాంటి ఆపద వచ్చిన అందరికీ అందుబాటులో ఉండి తమ శక్తి మేరకు సహాయ సహకారాలు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి ర్యాకం కేశవులు, ఉపాధ్యక్షులు రిటైర్డ్ టీచర్ గిరిమోని అంజిలయ్య, నర్సప్ప, డి గోపాల్, ఏవి రాములు, గిరి మోని శ్రీనివాసులు, దోమ వెంకటేష్, ముదిరాజ్ సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.






