13 April, 2026 | 4:00 PM

డిఫెన్స్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరగవు

13-04-2026 02:26 PM

సర్పంచ్ అరుణా దేశ్ పాండు 

మఠంపల్లి,(విజయక్రాంతి): డిఫెన్స్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరగవని సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి మండల పరిధిలో కొత్త దొనబండ తండా గ్రామంలో అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సర్పంచ్  ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రోడ్డు ప్రయాణ సమయంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చునని తెలిపారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని కోరారు. డిఫెన్స్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యాస్తాలని చేరుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్,వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు,ఆశా వర్కర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.