వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి, జులై 30 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 24 గంటలపాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.
రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక శాఖల అధికారులు సమన్వయంతో లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ప్రవహిస్తున్న వాగులు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. ముంపు, అత్యవసర పరిస్థితులలో ఈ కింది కంట్రోల్ రూమ్ నంబర్లు కు తక్షణ సాయం కోసం 040-23237416 లేదా 9704958473 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.






