31 July, 2026 | 1:09 AM

అనురాగ్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన

31-07-2026 12:00 AM

ఘట్ కేసర్, జూలై 30 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ద్వితీయ సంవత్సరం, బీబీఏ తృతీ య సంవత్సరం విద్యార్థులకు  హైదరాబాద్లోని ఐ కార్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసర్చ్ లో పారిశ్రామిక పర్యటన నిర్వహించారు.

ఈ పర్యటనలో మొత్తం 85 మంది విద్యార్థులు ముగ్గురు అధ్యాపకుల పర్యవేక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల చిరుధాన్యాలు (మిల్లెట్స్), వాటి ప్రాథమిక ప్రాసెసింగ్ విధానా లు, ఆధునిక యంత్రాలు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేపట్టే ప్రా సెసింగ్ దశలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్ ఫెసిలిటీ, ని రంతర మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్, మిల్లెట్ ఆధారిత స్టార్టప్లకు ప్రోత్సాహం అందించే న్యూట్రిహబ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని సందర్శించారు.

మిల్లెట్ ఆధారిత విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను కూడా పరిశీలించారు. ఈ పర్యటన ద్వారా చిరుధాన్యాల పోషక వి లువలు, ఆధునిక ఆహార ప్రాసెసింగ్ సాంకేతికతలు, వ్యవసాయ ఆధారిత స్టార్టప్లకు ప్ర భుత్వ ప్రోత్సాహకాలు, ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించారు. పరిశ్రమల పనితీరు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, స్థిరమైన ఆహార ఉత్పత్తి విధానాలపై విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు.