28 May, 2026 | 11:55 AM

గొల్లాపూర్ గొంతు ఎండుతుంది.. వారం రోజుల నుండి భగీరథ బంద్

28-05-2026 10:47 AM
  1. గొల్లాపూర్ గొంతు ఎండుతోంది.
  2. వారం రోజుల నుండి భగీరథ బంద్.
  3. మొరాయించిన బోర్ బావి.

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని మారుమూలన ఉన్న ఆదివాసి గిరిజన గ్రామమైన గొల్లాపూర్ గ్రామస్తులు(Gollapur Villagers) గత ఆరు రోజుల నుండి త్రాగునీరు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గ్రామంలో ఉన్న ఒకే ఒక్క బోరుబావి వద్ద నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. అయితే బోరు బావి సహితం మూడు రోజుల నుండి పనిచేయకపోవడంతో తాము గ్రామానికి దూరంగా ఉన్న భావి వద్దకు వెళ్లి త్రాగునీటిని తెచ్చుకుంటున్నామంటున్నారు.

ఆ బావిలో సైతం నీటి కలుషితం ఉందని ఆ నీటిని తాగాలంటే వ్యాధులు వచ్చే విధంగా ఉన్నాయని అంటున్నారు. మిషన్ భగీరథలు పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది తమకు వేతనాలు రాకపోవడంతో నీటి సరఫరా  నిలిపివేశామని అంటున్నట్లు గ్రామానికి చెందిన ఆదివాసీలు వాపోయారు. పశువులకు గ్రామం సమీపంలోని వాగులో నీటిని తాపుతున్నామని అయితే పశువులు ఆ నీటిని తాగేందుకు ఇష్టపడడం లేదని గ్రామ రైతులు అంటున్నారు. జిల్లా మండల స్థాయి అధికారులు తక్షణమే గ్రామంలో ఉన్న నీటి ఎద్దడి తీవ్రతపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.