28 May, 2026 | 11:34 AM

30 నిమిషాలపాటు చిగురుటాకుల వణికిన దమ్మపేట

28-05-2026 10:49 AM

దమ్మపేట, మే 28(విజయ క్రాంతి): మండల కేంద్రంలో గురువారం ఉదయం గాలి వాన బీభత్సానికి దమ్మపేట చిగురుటాకుల వణికి పోయింది.  భారీగా వీచిన గాలులతో పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టు, కరెంటు స్తంభం విరిగి రోడ్డుపై పడ్డాయి.   కొత్తపేటలో పెద్ద మామిడి చెట్టు కూలిపోయి కరెంట్ స్తంభంపై పడటంతో స్తంభం విరిగిపోయి, వైర్లు తెగిపోయాయి.  రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారు అర గంట సేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడిపారు.  మాడు పగిలే ఎండలతో సతమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ, చెట్లు విరిగి, కరెంట్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సిబ్బంది అధిక శ్రమతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసిన అవసరం ఏర్పడింది.