13 March, 2026 | 10:00 PM

పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను త్వరితగతిన పూర్తిచేయాలి

13-03-2026 12:40 AM

వనపర్తి, మార్చి 12 ( విజయక్రాంతి ) : జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సం బంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఇత ర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలం గాణ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కే శివకుమా ర్ నాయుడు ఆదేశించారు. తెలంగాణ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు గురువారం నాడు వనపర్తి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు . 

ఈ పర్యటనలో భా గంగా ఆయన ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల అధికా రుల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా లో కొనసాగుతున్న పలు నీటిపారుదల ప్రా జెక్టుల భూ సేకరణకు సంబంధించిన పెం డింగ్ అంశాలు,  పునరావాస పనుల పురోగతి  అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చ ర్చించారు. జిల్లాలో గణపసముద్రం ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న 197 ఎకరా ల భూసేకరణకు వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ దారి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా కర్నె తాండ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి పెండింగ్ 26 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ ఈనెల 14వ తేదీలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద డి 1, డి 5, డి 8, ప్యాకేజ్ 29 కు సంబంధించి 92 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ త్వరగా వారంలోపు  కంప్లీట్ చేయాలి అన్నారు. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మార్కింగ్ పూర్తయిన 31 ఎకరాల భూమికి సంబంధించి సర్వే శాఖ అధికారులు వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.

అంతకు ముందు కొత్తకోట మండల పరిధిలోని కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ తో పాటు, శంకర సముద్రాన్ని సందర్శించిన కమిషనర్ అరెండర్ సెంటర్లో పెండింగ్ అంశాలను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ఎస్ ఈ చంద్రశేఖర్, ఈ ఈ కేశవరావు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే ఏడి శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.