calender_icon.png 7 February, 2026 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెదనెమిల మాజీ సర్పంచ్ మంగ్య నాయక్ కన్నుమూత

07-02-2026 07:57:41 PM

నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని పెదనెమిల గ్రామ మాజీ సర్పంచ్ బానోతు మంగ్య నాయక్ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు.​మంగ్య నాయక్ మృతి విషయం తెలుసుకున్న పెదనెమిల గ్రామ సర్పంచ్ చురకంటి లావణ్య మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ మండల నాయకులు బాసినపల్లి మల్లయ్య మృతుని నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో మంగ్య నాయక్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృతి గ్రామానికి, వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొని మంగ్య నాయక్‌కు నివాళులు అర్పించారు.