26 February, 2026 | 12:27 PM

ఆరేళ్లలో రూ.72 వేల కోట్ల చెల్లింపులు

26-02-2026 12:54 AM
  1. కాళేశ్వరంతో రాష్ట్రంపై రుణభారం

ఒక్క జనవరిలోనే రూ.417 కోట్ల వడ్డీ

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ట్ర ఖజానాపై భారీ ఒత్తిడిని మోపుతున్న అంశంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రుణ చెల్లింపులు మారాయి. సాగునీటి విస్తరణ లక్ష్యంతో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్‌కు తీసుకున్న రుణాలపై గత ఆరేళ్లలోనే రూ.72 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి రావడం ఆర్థిక వాస్తవాలను వెలు గులోకి తీసుకొచ్చింది. ప్రతినెలా వందల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొనగా 2026 జనవరిలో ఒక్క నెలలోనే రూ.417 కోట్ల వడ్డీ చెల్లింపులు చేయడం గమనార్హం.

అధికారిక సమాచారం ప్రకారం 2020 నుంచి 2025 వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మూలధనం, వడ్డీ రూపంలో మొత్తం రూ.72,766 కోట్లకుపైగా చెల్లించారు. ఏటా చెల్లింపులు భారీ గా పెరుగుతూ రావడం గమనార్హం. ము ఖ్యంగా 2025లో ఒక్క ఏడాదిలోనే రూ.33,574 కోట్లకు పైగా చెల్లించడం ప్రా జెక్ట్ రుణభారం తీవ్రతను తెలుపుతున్నది.

ఒక్క జనవరిలోనే రూ.417 కోట్ల వడ్డీ...

2026 జనవరి నెలలో వివిధ బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు మొత్తం రూ.417 కోట్ల వడ్డీ చెల్లించారు. ఇందులో ముఖ్యంగా పీఎఫ్‌సీకి అత్యధికంగా రూ.273.41 కోట్లు చెల్లిం చగా, మిగతా మొత్తాలు పీఎన్‌బీ, యూబీఐ కన్సార్టియంలు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు చెల్లించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి సరఫరా, పరిశ్రమలకు నీటి అందుబాటు వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.

అయితే, పెరుగుతున్న రుణాలు, వడ్డీ చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక స్థితిపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ ప్రయోజనాలు ఎంతవరకు అందుతున్నాయి? రుణభారం ఎంతవరకు తగ్గుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆర్థిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

సంవత్సరాల వారీగా చెల్లింపులు.. 

2020 రూ.1,487.98 కోట్లు

2021 రూ.3,364.65 కోట్లు

2022 రూ.9,077.01 కోట్లు

2023 రూ.11,873.70 కోట్లు

2024 రూ.13,388.71 కోట్లు

2025 రూ.33,574.11 కోట్లు