26 February, 2026 | 10:17 AM

సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలి

26-02-2026 12:55 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సమాజసేవలో ప్రతీఒక్కరు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.  డాక్టర్స్ ఫర్ యు ఎన్జీవో సహకారంతో హెచ్సిఎల్  ఫౌండేషన్ విరాళంగా ఇచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలను గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ హాస్పిటల్ కు అత్యాధునిక పరికరాలు అందించిన హెచ్సిఎల్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారు అందజేసిన  అత్యాధునిక వైద్య పరికరాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ఈ పరికరాలు రోగి సంరక్షణ, కార్యాచరణ సామర్థ్యాన్ని బాగా పెంచుతాయన్నారు. ప్రస్తుత రోజుల్లో  ప్రైవేట్ వైద్యశాలలో  వైద్యం చేయించుకోలేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాదునిక వైద్య పరికరాలు సమకూర్చుకోవడంతో పేదవారికి వైద్యభారం తగ్గుతుంద న్నారు.

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడ ప్రైవేటు హాస్పిటల్స్ కు  దీటుగా వైద్యం లభిస్తుందనే నమ్మకం ప్రతి పేదవాడికి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు డీఎంఈ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జయలత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అదనపు డీఎంఈ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. శ్రావణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ హెచ్ సీఎల్ ఫౌండేషన్  అసోసియేట్ డైరెక్టర్ సీమి సూరి, డాక్టర్ చేతన తీర్థహళ్లి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.