7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

సూపర్-8లో పాకిస్థాన్

19-02-2026 02:31 AM

కొలంబో, ఫిబ్రవరి 18 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ సూపర్-8లో అడుగుపెట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ సమష్టిగా చెలరేగింది. నమీబియాతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 102 పరుగుల భారీ తే డాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 3 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది.

షాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ సల్మాన్ అఘా(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38), షాదాబ్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 36 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సెల్(2/48) రెండు వికెట్లు తీయగా.. గెర్హార్డ్ ఎరాస్మస్(1/25) ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. స్టీన్కాంప్(23), అలెగ్జండర్(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు.