calender_icon.png 19 February, 2026 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో రెవెన్యూ ఆర్‌ఐకు రజతం

19-02-2026 02:29:00 AM

ధర్మపురి, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): అబుదాబీలో జరిగిన అంతర్జాతీయ ఆర్చరీ క్రీడా పోటీల్లో వెల్గటూర్ మండల రెవెన్యూ పరిశీలకురాలు(ఆర్‌ఐ) దొంత రాజేశ్వరి సత్తా చాటారు. ఫిబ్రవరి 6వ తేదీ నుండి 12 వ తేదీ వరకు ఓపెన్ మాస్టర్ 2026 క్రీడల్లో ఆర్చరీ ఈవెంట్‌లో రజత పతకం కైవసం చేసుకున్నారు. ఈ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా 148 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 50 ఏళ్ల విభాగం కాంపౌండ్ ఆర్చరీ 50 మీటర్ల కేటగిరీలో ఆర్‌ఐ దొంత రాజేశ్వ రి రజతాన్ని గెలిచారు.

సామాన్య కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి ప్రభుత్వ ఉద్యో గం సాధించినప్పటికీ ఆర్చరీ క్రీడా పట్ల ఉన్న మ క్కువను పక్కన పెట్టలేకపోయారు. ఉద్యో గ బాధ్యతలు నిర్వహిస్తూనే అనేకసార్లు దేశ, విదేశాల్లో ఆర్చరీ పోటీల్లో పాల్గొంటూ పలు పతకాలు సాధించి ఇండియాకు, తెలంగాణ కు గర్వకారణంగా నిలిచారు. తాజాగా అంతర్జాతీయ ఆర్చరీలో ఆమె రజతం సాధించడంపై వెల్గటూర్ మండల తహసీల్దార్  రాపెల్లి శేఖర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు రాజేశ్వరిని అభినందించారు.