7 May, 2026 | 2:07 PM

Breaking News

కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •  

శ్రీలంక జట్టుకు బిగ్ షాక్

19-02-2026 02:34 AM

పతిరణకు గాయం

మిగిలిన మ్యాచ్‌లకు డౌటే

కొలంబో, ఫిబ్రవరి 18 : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్ పోరుకు ముందు శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహేశ్ పతిరణ గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సంద ర్భంగా అతనికి గాయమైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు పతిరణ అందుబాటలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

ఆస్ట్రేలియా తో మ్యాచ్ సందర్భంగా పతిరణకు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు కుంటుతూనే మైదానం వీడాడు. ప్పి ఎక్కువగా ఉండటంతో.. అతడికి దాదాపు మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ వర్గాలు అందించిన వివరాల ప్రకారం.. పతిరణ గాయం వల్ల మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. అతడి స్థానంలో బిను ర ఫెర్నాండో లేదంటే దిల్షాన్ మధుషాంక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

నువాన్ తుషార, మిలాన్ రత్ననాయకే రూపంలో మరో రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాగా ఆసీస్‌పై పతిరణ కేవలం నాలుగు బంతులే బౌల్ చేసి మైదానం వీడాడు. కాగా ఇప్పటికే వనిందు హసరంగా టోర్నీకి దూరమయ్యా డు. అయినప్పటకీ ఆసీస్ పై అద్భుత ఆటతీరు కనబరిచిన లంక సూపర్ 8లో అడు గుపెట్టింది.దసున్ షనక సారథ్యంలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక దసున్ షనక సారథ్యంలో అదరగొడుతోంది. తొలుత ఐర్లాండ్‌ను, రెండో మ్యాచ్ లో ఒమన్‌ను అలవోకగా ఓడించింది. చివరగా ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి.. సూపర్-8 బెర్తును అధికారికంగా ఖరారు చేసుకుంది.