మానసికంగా బాగుండాలి
ఆధునిక జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావం, కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తరణ మధ్య మానసిక ఆరోగ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతోందని, యువత అప్రమత్తంగా ఉండాలని కామినేని ఆస్పత్రి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘మెంటల్ హెల్త్ అవేర్నెస్ మంత్- 2026’ సందర్భంగా ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో శనివారం ఈ ఏడాది మానసిక ఆరోగ్య అవగాహన నెల థీమ్ ‘కలిసికట్టుగా మరిన్ని మం చి రోజులు’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘అపోహల స్థానంలో అవగాహన, మౌనం స్థానంలో పరస్పర అనుబం ధం’ పెరిగినప్పుడే భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపడుతుందని ‘కామినేని ఆస్పత్రి సైక్రియా ట్రిస్ట్లు సూచించారు.
ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి సీనియ ర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎమ్. సార ధి గౌడ్ మాట్లాడుతూ.. ‘శారీరక, మానసిక ఆరోగ్యాలు పరస్పరం విడదీయరాని సంబంధంతో ఉంటాయి. శారీరకంగా ఎంత ఆరో గ్యంగా ఉన్నా మానసిక ఆరోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదు. యువతలో ఈ తరహా అవగాహన పెరుగుతున్నప్పటికీ, మానసిక అనారోగ్యాలపై ఉన్న అపోహలు, భయాలు ఇంకా చాలా మందిని ప్రారంభ దశలోనే వైద్యం, చికిత్సలు తీసుకోకుండా అడ్డు కుంటున్నాయి. ఇప్పటికీ చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నా.. సైకియా ట్రిస్టును సంప్రదించడానికి వెనుకంజ వేస్తున్నారు. సమాజం తమను తప్పుగా అర్థం చేసు కుంటుందనే భయం వారిలో ఉంటుంది.
మానసిక సమస్యలను బలహీనతగా, ఆత్మవిశ్వాసం లోపంగా అతి ఆలోచనగా భావించ డం సాధారణమైపోయింది. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, భావోద్వేగ అలసట వంటి సమస్యలను చాలామంది సహజంగా తీసుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. డయాబెటిస్, గుండెజబ్బుల మాదిరిగానే మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా వైద్య సహాయం తీసుకోవడం సాధారణంగా చూడాల్సిన అవసరం ఉంది. సకాలంలో గుర్తింపు, కౌన్సెలింగ్, జీవనశైలి మార్పులు, అవసరమైతే మందుల తో మానసిక సమస్యలను సమర్థంగా నియంత్రించవచ్చు.’ అని పేర్కొన్నారు.
యువతపై ఒత్తిడి ప్రభావం
కామినేని సైకియాట్రీ విభాగం కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి నాగభైరవ మాట్లాడుతూ.. ఏఐ, స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ఆధిపత్యం పెరిగిన ఈ కాలంలో టెక్నాలజీ ఒకవైపు విద్య, వైద్యం, కమ్యూనికేషన్కు ఉపయోగపడుతున్నప్పటికీ.. మరోవైపు మానసిక ఒత్తిడులకు కారణమవుతోందన్నారు. ఎప్పుడూ సంతోషంగా కనిపించాలనే ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అసాధ్యమైన జీవనశైలు లు, అంద చందాల ప్రమాణాలు యువతలో ఆత్మవిశ్వాసం, భావోద్వేగ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు.
పిల్లలు, టీనేజర్లు మరింత ప్రభావితమవుతున్నారని ఆమె ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. బయట ఆటలు తగ్గిపోవడం, అధిక స్క్రీన్ టైమ్, నిద్రలోపం, ఏకా గ్రత తగ్గడం, భావోద్వేగ నియంత్రణ లోపించడం, చిన్న విషయానికే అసహనం పెరగడం వంటి సమస్యలు అధికమవుతున్నాయని వెల్లడించారు. టెక్నాలజీని పూర్తిగా తప్పుబట్టలే మని, అయితే అది మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు, నిద్ర, వ్యాయామం, భావోద్వేగ బలాన్ని నియంత్రించినప్పుడు సమస్యలు మొదలవుతాయని డాక్టర్ గౌతమి వివరించారు.
మానసిక అనారోగ్యాలకు చికిత్స
మానసిక అనారోగ్యాలకు చికిత్స ఉందని, ముందస్తు గుర్తింపు, భావోద్వేగ మద్దతు, సైకోథెరపీ, జీవనశైలి మార్పులు, అవసరమైన ప్పుడు మందుల వాడకం ద్వారా జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరచవచ్చునని అందుకే ఈ మానసిక ఆరోగ్య అవగాహన నెలను ఒక్క అవగాహనకే కాకుండా అపోహలను తొలగించడం, టెక్నాలజీని సమతుల్యం గా, బాధ్యతాయుతంగా వినియోగించడం పై దృష్టి పెట్టాలని అవగాహన కల్పిస్తున్నామని గౌతమి నాగభైరవ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అయినప్పటికీ మానసి క ఆరోగ్యం ఎంతో కీలకమని, మానసిక ఆరో గ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.






