30 July, 2026 | 7:21 PM

Breaking News

ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

30-07-2026 06:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో సారంగాపూర్ లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పట్టణంలోని సిద్దాపూర్ గాయత్రి నగర్ కాలనీవాసులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సిద్ధాపూర్ బ్రిడ్జిని తాసిల్దార్ ప్రభాకర్ పరిశీలించి రాకపోకలను నిలుపుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వివరించారు. వర్షాల నేపథ్యంలో పట్టణంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల అనురాధ గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు కాలనీలను పరిశీలించారు