30 July, 2026 | 7:22 PM

Breaking News

శివుడికి కలబంద పూలతో ప్రత్యేక పూజలు

30-07-2026 06:30 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత వాడలో గల శివాలయంలో గురువారం శివుడికి ఎంతో ఇష్టమైన కలబంద పూలతో ప్రత్యేక పూజలు జరిపించారు. అంతకు ముందు అభిషేకం చేశారు. ప్రముఖ రైస్ మిల్ ల వ్యాపారవేత్త కొమురవెల్లి రామ్మూర్తి సత్యమ్మ, వారి కుమారుడు, కోడలు రాజేష్ ప్రియాంక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వల్లకొండ మఠం రమేష్ దంపతులచే పూజ లు చేయించారు, చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది... పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.