30 July, 2026 | 8:02 PM

Breaking News

'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •   విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యం   •  

రాబోయే 12 గంటలు జిల్లాకు రెడ్ అలర్ట్

30-07-2026 07:07 PM

- ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దు

- జిల్లా కలెక్టర్ రాజర్షిషా

తాంసి,(విజయక్రాంతి): జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం తాంసి మండలం భీమన్న వాగు కల్వర్టు ప్రాంతాన్ని, మత్తడి వాగు ప్రాజెక్ట్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో గత 24 గంటల్లో సగటున 60 మి.మీ వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా ఇచ్చోడ, బజార్‌హత్నూర్ పరిధిలో 10 నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసిందని తెలిపారు.

మత్తడి వాగు ప్రాజెక్టు వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలను ముందస్తుగానే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. వాగులు, చెక్ డ్యామ్‌ల వద్ద పొంగిపొర్లుతున్న లోలైన్ కాజ్‌వేల వద్ద ప్రమాదాలు జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసుల భాగస్వామ్యంతో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు చెప్పారు.

రాబోయే 12 గంటల పాటు జిల్లా రెడ్ జోన్ పరిధిలోనే ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 లేదా 100 నంబర్‌కు సంప్రదించాలని, జిల్లా యంత్రాంగం నిరంతరం సహాయక చర్యలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. వీరి వెంట తాంసి, తలమడుగు తహసీల్దార్లు గణేష్, రాజ్ మోహన్, నీటి పారుదల శాఖ అధికారులు ఈఈ నరేష్, డిఈఈ శ్రీనివాస్ రావు, ఏఈఈ హరీష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులున్నారు.