శ్రీ సరస్వతీ శిశు మందిర్ గోరింటాకు సంబరాలు
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరినగర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు సంబరాలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పిడి వకుల దేవి, గీకురు కృష్ణవేణి,మాతాజీలు,విద్యార్థులు పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోరింటాకు ప్రాముఖ్యత, ఆషాఢ మాస విశిష్టత, భారతీయ కుటుంబ విలువల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం, అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల ప్రదానాచార్యులు మోర రణదీర్ తెలిపారు.






