చిల్డ్రన్స్ హోమ్‌ను సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పుష్పలత
30-07-2026 07:21 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్‌ను మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత గురువారం సందర్శించారు. చిల్డ్రన్స్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోయిన ఘటనపై అక్కడి ఇన్‌చార్జ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్‌లో పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, మెనూను పరిశీలించిన పుష్పలత, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ చింతల రాజు మరియు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






