30 July, 2026 | 8:06 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

టీటీసీ పరీక్షల నేపథ్యంలో సెక్షన్ 163 అమలు

30-07-2026 06:59 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): ఆగస్టు 2న నిర్వహించే టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (TTC) కోర్స్ పరీక్షల సందర్భంగా నిజామాబాద్ జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్ 163 అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రాల 100 మీటర్ల పరిధిలో గుమికూడడం, నిషేధిత వస్తువులతో సంచరించడం నిషేధమని పేర్కొన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలు కూడా అదే సమయంలో మూసివేయాలని ఆదేశించారు.