30 July, 2026 | 8:24 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •  

దాతల సహకారం అభినందనీయం: ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

30-07-2026 07:18 PM

కోదాడ,(విజయక్రాంతి): దాతల సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. స్నేహ హస్తాలు ఫౌండేషన్, రే ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోదాడ మండలంలోని రెడ్లకుంట ప్రాధమికోన్నత పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. స్నేహ హస్తాలు ఫౌండేషన్, శ్రీలక్ష్మి ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులు కునుగుంట్ల రవి కుమార్, రే ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ బాధ్యులు కంఠమనేని హేమ సహకారంతో సుమారు రూ.6.50 లక్షలతో ప్రాధమికోన్నత పాఠశాలలో  అధనపు వాష్ రూమ్స్ నిర్మాణం, పెయింటింగ్ పనులు చేయడం పట్ల దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ప్రతి ఒక్కరూ పాఠశాలల బలోపేతానికి తమవంతు చేయూతనందించాలని కోరారు.