30 July, 2026 | 8:25 PM

Breaking News

శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి   •   ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

ఖమ్మం నగరంలో వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వీడాలి

30-07-2026 07:09 PM

ప్రభుత్వానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచన

ఖమ్మం,(విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు పూడుకుపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా మందుల పిచికారీని క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు. వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని పేర్కొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు పనిచేయాలని, పారిశుద్ధ్యంపై ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.