30 July, 2026 | 8:24 PM

Breaking News

శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి   •   ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం

30-07-2026 07:13 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గల మహాత్మాగాంధీ జ్యోతిబాపూలె BC గురుకుల పాఠశాల కళాశాలను గురువారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల సౌకర్యార్థం 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించి నాణ్యతా లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

మొదట భోజనశాలను తనిఖీ చేసి, విద్యార్థుల కోసం వంటలో వినియోగించే అన్ని రకాల  కూరగాయలు, పప్పులు, దినుసులు సక్రమంగా కలిపి రుచికరంగా వండాలని తయారీదారులకు సూచించారు.స్టోర్ రూం లోని ఆహార పదార్థాలు బియ్యం, పప్పులు, ఇతర సరుకులు, దినుసులు, కూరగాయలు ఎప్పటికప్పుడు తాజాగా తెప్పించుకోవాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి  సూచించారు. ఆయన వెంట బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.