కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ పాలక మండలికి నోటిఫికేషన్
ఆలయ ఈవో లావణ్య
ఎల్బీనగర్, జులై 16 : కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి (హనుమాన్) దేవస్థానానికి నూతన ఆలయ కమిటీని నియ మించడానికి తెలంగాణ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు శ్రీ కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానం ఈవో లావణ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుగా సేవలందించేందుకు ఆసక్తి, అర్హత కలి గిన స్థానిక భక్తులు, ఆధ్యాత్మిక వేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
20 రోజుల సుదీర్ఘ గడువు
నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి 20 రోజుల లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఈవో లావణ్య స్పష్టం చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోరని తేల్చి చెప్పారు. దరఖాస్తుదారులు ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత నమూనా (నిర్ణీత ప్రొఫార్మా) లో మాత్రమే పూర్తి వివరాలను నింపాల్సి ఉంటుందన్నారు.
పూర్తి చేసి న దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో నిర్ణీత గడువు లోపల అందజే యాలని సూచించారు. నిబంధనల ప్రకా రం తుది నియామక జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది. క్షేత్ర అభివృద్ధికి నిస్వార్థం గా సేవలందించేందుకు దాతలు, అర్హులైన భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో లావణ్య కోరారు.






