11 June, 2026 | 2:13 AM

భారీ వర్షం కారణంగా స్తంభించిన జనజీవనం

11-06-2026 12:00 AM
  1. గాంధీనగర్ డివిజన్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం..
  2. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్

ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాం తి): నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అనేక చోట్ల సుమారు 70కి పైగా భారీ చెట్లు  కుప్పకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలైన అరుంధతి నగర్, సబర్మతి నగర్, దోభి ఘాట్ బస్తీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు భయాందోళన చెందారు.

గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్  సూచనలతో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్,  బీజేవైఎం నాయకులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.  బుధవారం  నిర్విరామంగా ఎమర్జె న్సీ అధికారులతో కలిసి కూలిన చెట్ల కొ మ్మలు, విరిగి పడిన విద్ధ్యుత్ తీగలు, తొలగించడం జరిగిందన్నారు.

ఇళల్లోకి చేరిన వరద నీటితో ఆందోళన చెందిన ప్రజలకు సేవలందించారు. డివిజన్‌లో నెలకొన్న విప త్తు పట్ల ఎప్పటికప్పుడు డిఆర్‌ఎఫ్ హైడ్రా, విద్యుత్ అధికారులతో సమన్వయం అవు తూ ఆందోళనకు గురవుతున్నా ప్రజలకు అండగా ఉంటామని వినయ్ కుమార్ తెలిపారు.  లోతట్టు ప్రాంతాల బస్తీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

24 గంటలుగా అంధకారంలో వున్న డివిజన్ లోని పలు ప్రాంతాల్లో విద్ద్యుత్ అధికారులు కరెంటు సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారని, కూలిన చెట్ల కొమ్మలను ఎక్కడికి అక్కడ  డీఆర్‌ఎఫ్ హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారని తెలిపారు. ఈ సహాయక చర్యల్లో బీజేవైఎం నాయకులు అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, ప్రశాంత్, వరుణ్, క్రాంతి, సాయి, చింటు పాల్గొన్నారు.