బాసర గోదావరిలో భక్తుల మరణ మృదంగం
గోదావరిలో ప్రమాద హెచ్చరికలు కరువే..
నీట మునిగితే ప్రాణాలు హరీ
పట్టించుకోని అధికారులు.. ప్రాణాలు తీసుకుంటే భక్తులు
ఏడాదిలో 15 మంది మృతి
నిర్మల్ జూన్ 10 (విజయక్రాంతి): బాసర గోదావరిలో భక్తుల మరణ ఘోష కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించు కుందామని వచ్చిన భక్తులు గోదావరిలో స్నానం చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
గోదావరి నదిలో ప్రమాదాలు కొత్తేమి కావు. ఏడాది పొడవునా పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు ఆచరిం చడానికి వచ్చిన భక్తులు నీటి ప్రవాహం లోతు తెలియక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాది క్రితం జూన్ 16న హైదరాబాద్ కు చెందిన రాజస్థాన్ కుటుంబీకులు బాసరకు వచ్చి వారి పిల్లలు స్నానా లు చేస్తుండగా ఆరుగురు నీట మునిగి చనిపోయారు. వారంతా అన్నదమ్ములు బంధు వులు కావడంతో తీవ్ర విషాదం నింపింది.
తాజాగా హైదరాబాద్ కాచిగూడ చెప్పల్ బజార్ చెందిన చంద్రశేఖర్, రామచంద్ర మల్లేష్ ముగ్గురు సొంత అన్నదమ్ములు అమ్మానాన్నలు వారి భార్యాబిడ్డల ముందే గోదావరి నదిలో మునిగి మరణించడం ఆ కుటుంబంలో తీవ్రవీషధాన్ని నింపింది.
ఇలా ఏడాది కాలంలో ఇప్పటివరకు బాసర పుష్కర ఘాట్ ల వద్ద 15 మంది గోదావరి నీటిలో గల్లంతై చనిపోయినట్టు భక్తులు ఆరోపిస్తున్నారు. బాసర అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించుకుని తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలలుగన్న ఆ కుటుంబాల్లో కలలన్నీ కన్నీళ్ళ ముందే కరిగిపోవడంతో బాసరకు వచ్చిన భక్తులు గోదావరిలో మునిగి చావాలా అం టూ వారి ఆక్రందన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
నీటిలో మునిగితే ప్రాణాలు హరి
తెలంగాణ రాష్ట్రంలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కేరళ తమిళనాడు మధ్య ప్రదేశ్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు బాసరకు వచ్చి వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.
బాసరకు చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్థానాలు చేసి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం పూజల చేస్తారు. బాసర గోదావరి వద్ద పుష్కర ఘాట్లు ఉన్నప్పటికీ అక్కడ రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాలుగు పుష్కర ఘాట్లు ఉండగా ప్రధాన పుష్కర కార్డుల వద్ద భక్తులకు కొన్ని రక్షణ చ ర్యలు ఉన్న మిగతా వద్ద రక్షణ చర్యలు లేవు. భక్తులు కొత్తవారు కావడంతో ఘాట్ల వద్ద గోదావరిలో పుణ్య స్థానాల కోసం నీటిలో మునిగితే నీటి ప్రభావం నీటి లోతు తెలియక ఈతరానివారు నీటిలో మునిగి గల్లత్తు అవుతున్నారు.
సుమారు కిలోమీటర్ పొడుగులో నీటి ప్రవాహం ఉండడంతో వారిని రక్షించి అవకాశం ఉండడం లేదు. పుష్కర గట్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవు. నీటి లోతు తెలిపే బోర్డులు లేవు. నల్ల మట్టి ఉండడం వల్ల భక్తులు స్నానం చేసేటప్పుడు మట్టితో కాలుజారి గోదావరి నదిలోకి జరుపుకుంటున్నారు. వారిని రక్షించేందుకు మిగతావారు ప్రయాణిస్తే వారు కూడా ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. పుష్కర గాట్ల వద్ద బోటింగ్ సౌకర్యం ఉన్న అవి పురాతన బోట్లు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
గజ ఈతగాళ్లు చేపలు పట్టే మచ్చ కార్మికులు ప్రమాదాలు జరిగిన చోట ఉంటే భక్తులను రక్షించుకునే అవకాశం ఉంటుంది. గజ ఈతగాళ్లు లేకపోగా పుష్కర ఘాట్ల వద్ద లోనికి వెళ్లకుండా ఇనుప సంకెళ్లు గొలుసులు ఏర్పాటు చేయాలి. పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది భక్తులకు సూచనలు హెచ్చరికలు ఎప్పటికప్పుడు ప్రకటించాలి.
అక్కడ ఇలాంటి హెచ్చరికలు భద్రతా సిబ్బంది లేకపోవడంతో భక్తులు స్థానాల కోసం నీటిలో మునిగి చనిపోతున్నారని ఇది ప్రభుత్వ వైఫల్య నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. నీట మునిగిన భక్తులను అక్కడ కొందరు రక్షించినప్పటికీ దగ్గరలో ఆసుపత్రి లేకపోవడంతో భైంసా నిజాంబాద్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే వారు మృతులతో పోరాడి చనిపోతున్నట్టు భక్తులు చెప్తున్నారు.
బాసర ఆలయానికి భక్తుల రద్దీ పెరగడం ఆదాయం పెరిగిన భక్తులకు కనీస సౌకర్యాలు లేవని అంటున్నారు. పుష్కర గాట్ల వద్ద ఒకచోట మాత్రమే లైటింగ్ ఉండగా లైటింగ్ లేదు. పుష్కర ఘాట్లు చెత్తాచెదారం ప్లాస్టిక్ మురికి ఉండడం వల్ల కొందరు భక్తులు మంచి నీటి కోసం పుష్కర ఘాట్లు కాకుండా ఇతర ప్రాంతాల్లో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు
అధికారుల కంటి తుడుపు చర్య
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో తరచుగా ప్రమాదాలు జరిగి భక్తుల ప్రాణాలు కోల్పోతున్న అధికారులు ఖండితుడుకు చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది హైదరాబాద్ చెందిన ఐదుగురు యువకులు ఒకేసారి గోదావరిలో స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, దేవాదాయ శాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
రెండు రోజులపాటు బాసర పుష్కర ఘాట్ ల వద్ద చేపట్టవలసిన చర్యలు భద్రతా చర్యలు, విపత్తు నిర్వహణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పుష్కర గట్ల వద్ద భక్తులు స్థానాలు చేసే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించారు. నల్ల మట్టిని తొలగించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని ఆలయ సిబ్బందిని సూచించారు. ఆ ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్, ఏర్పాటు చేయాలని సూచించారు.
స్థానాలు చేసే ప్రదేశాల్లో లోనికి వెళ్లకుండా ఇనుప గొలుసులు ఏర్పా టు చేసి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడందుకు పడవలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అధికారుల సూచనలు నెలరోజులు మాత్రమే అమలు చేసిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదని భక్తులు మండిపడుతున్నారు. తాజాగా మరో ముగ్గు రు అన్నదమ్ములు గోదావరిలో మునిగి చనిపోయిన విషయం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తే భక్తులు కావాలా అంటూ ఆకాశం వెలగకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు బాసర గోదావరి వద్ద రక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టి భద్రత పర్యవేక్షించాలని భక్తులు కోరుతున్నారు.






