11 June, 2026 | 2:35 AM

సీఎం రేవంత్‌రెడ్డికి మేడిగడ్డనే దిక్కు

11-06-2026 01:47 AM
  1. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఆయకున్న ఆప్షన్
  2. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డికి మేడిగడ్డనే ఇక దిక్కు అని, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఆయనకున్న ఏకైక ఆప్షన్ అని మాజీ ఎంపీ బోయి నపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఆనాడు మేడిగడ్డ బరాజ్ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి చూశారని, ఇప్పుడు రిపేర్లు స్టార్ట్ చేశారని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు నేను అడ్డు పడితే రాజీనామా చేస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నా రని తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాణహిత, చేవె ళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది మాజీ సీఎం వైఎస్‌ఆర్ అని గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి అనుమతి విషయంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే తీవ్రం గా ప్రయత్నించినా ఫడ్నవీస్ ఒప్పుకోలేదని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లెటర్ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారని, మహారాష్ట్ర సీఎంతో ఘర్షణ పూరితంగా సీఎం ఎలా వెళతారని నిలదీశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. బండి సంజయ్ పరిష్మన్ తెస్తానని చెప్పి ఇప్పటివరకు అతీగతీ లేదని విమర్శించారు.

ఫడ్నవీస్ కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వరని కాంగ్రెస్, బీజేపీ ఇద్దరికీ తెలుసని ఎందుకు డ్రామాలాడుతున్నారని నిలదీశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జడ్పీ మాజీ చైర్మన్ దఫెదార్ రాజు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.