11 June, 2026 | 3:10 AM

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

11-06-2026 02:13 AM

ఎంఎల్‌ఏ బొజ్జు పటేల్ 

జన్నారం, జూన్ 10 : మహిళలు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. బుధవారం జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ శివారులో ఆదివాసి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తుల శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వెదురు వస్తువులను పరిశీలించి, వారి నైపుణ్యాలను పరిశీలించారు.

వెదురు ఉత్పత్తుల తయారీలో మరిన్ని మెళకువలు నేర్చుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళికి మంచి భవిష్యత్తు ఉంటుందని, అందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. అనంతరం ఇంధన్ పల్లి ఎఫ్ ఆర్ వో కార్యాలయంలో మొక్కలు నాటి నీళ్ళు పోసి, వీటిని కాపాడే బాధ్యత అందరిదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్, స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్, పలువురు ఎఫ్‌ఆర్‌ఓలు, అటవీశాఖ సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.