ఆల్ఫా యాక్షన్
ఆలియా భట్ ప్రధాన పాత్రలో యశ్‌రాజ్ ఫిలమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. ఆల్ఫా స్వభావాన్ని అలవరుచుకున్న ఇద్దరమ్మాయిల కథతో దర్శకుడు శివ్ రవాలి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. చిన్న వయస్సు నుంచే పెంచి, హత్యలు చేయడానికి తయారుచేసిన ఓ హంతకురాలుకి సంబంధించిన మూల కథతో రూపొందిం చారు.
తొలి మహిళా గూఢాచారి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆలియాభట్ ఓ హంతుకురాలి పాత్రలో నటించింది. బాబీ డియోల్, అనీల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆలియా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు.
ఈ టీజర్‌ను గమనిస్తే.. బాబీ డియోల్ తండ్రి పాత్రలో కనిపించారు. తన కుమార్తెను బాబీ (ఆలియాభట్) చిన్నప్పటి నుంచే హత్యలు చేసే ఓ హంతురాలిగా పెంచి పెద్ద చేస్తాడని అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన శర్వారి పాత్రను మేకర్స్ పరిచయం చేయబోతున్నారు. జూలై 3న ఈ మూవీ రిలీజ్ కానుంది.






