5 May, 2026 | 8:29 PM

Breaking News

క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •  

నోరి దత్తా త్రేయుడికి సత్కారం

01-02-2026 12:45 AM

పద్మభూషణ్ వరించినందున సింధు హాస్పిటల్స్ వారి సన్మానం

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ప్రముఖ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రే యుడిని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ వరించిన సంద ర్భంగా సింధు హాస్సిటల్స్ ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్స్ ఆవరణలో శనివారం డాక్టర్లు, పరిశోధకులు, నిష్ణాతులైన పలువురు వైద్యప్రముఖులు ఆయనను ప్రస్తుతించారు.

సింధు హాస్పిటల్స్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ‘డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని వరించిన పద్మభూషణ్ పురస్కారం మొత్తం వైద్యరంగానికీ, భారతదేశం లోని డాక్టర్లందరికీ దక్కిన అరుదైన గౌరవమ’ని తెలిపారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తమ సింధు హాస్పిటల్స్కు ప్రధాన సలహాదారుగా పనిచేయడం తమకెంతో  గర్వకారణ మం’టూ ఆయన తన హర్షాన్ని వ్యక్తం చేశా రు.

డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ ‘మన సంస్థలోని నర్స్లూ, డాక్టర్లు, ఇతర సహాయ సిబ్బందినీ, వారి తాలూకు ఆ బృందస్ఫూర్తిని చూసినప్పుడు నాకు వీ ళ్లందరూ ఓ హాస్పిటల్ సిబ్బందిలా కాకుం డా పేషెంట్లను సంరక్షించే ఆపన్నహస్తాలుగా కనిపిస్తారు. పేషెంటుకూ వ్యాధికీ మధ్య కవచంలా నిలబడి బాధితులను పూర్తిగా కోలు కునేలా చేస్తారు. పేషెంట్లను వారి ఉద్విగ్న స్థితి నుంచి ఉపశమనానికి తీసుకువస్తారు’ అంటూ వారి సేవలను కొనియాడారు.