5 May, 2026 | 7:05 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు

01-02-2026 12:48 AM

గుర్తింపుగా ఫెమినా అచీవర్స్ అవార్డు అందుకున్న నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి పొంగూరు 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి పొంగూరు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల అభివృద్ధి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ’ఫెమినా అచీవర్స్ అవార్డ్స్ 2026 నార్త్’ వేదికగా ’ఎక్సలెన్స్ ఇన్ స్టూడెంట్ మైండ్సెట్, లీడర్షిప్ డెవలప్మెంట్‘ అవార్డు అందుకున్నారు. భారతదేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఆమె పోషిస్తున్న పాత్రకు గు ర్తింపుగా ఈ పురస్కారం లభించటం గమనా ర్హం.

విద్యార్థులలో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించి, వారిలో స్పష్టమైన లక్ష్యాల ను, ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు విద్యార్థుల్లో మానసిక పరివర్తనకు కోసం శరణి పొంగూరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. విద్యతో పాటు సైకాలజీ, న్యూరో-లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, పర్పస్-డ్రివెన్ గోల్ సెట్టింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను మిళితం చే స్తూ ఆమె అందిస్తున్న శిక్షణ విద్యార్థులలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

ఈ సందర్భంగా శరణి నారాయణ మాట్లాడు తూ.. ‘ఈ గుర్తింపు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ప్రతి విద్యార్థిలోనూ అపారమైన ప్రతిభ ఉంటుంది. వారు తమ కలలను న మ్మేలా చేసి, సరైన దిశానిర్దేశం చేసినప్పుడు అద్భుతమైన మార్పు సాధ్యమవుతుంది  అని పేర్కొన్నారు.