త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
18 కార్పొరేషన్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఈ నెలాఖరులోగా నియమించాలని నిర్ణయం
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. ఆశావాహులకు పదవుల జాతర రానుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న వాటిలో మొదటగా దాదాపు 18 కార్పొరేషన్ల వర కు పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒకటి, రెం డురోజుల్లో వివిధ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు సభ్యులను కూడా నియమించే అవకాశం ఉంది.
అయితే కీలకమైన కార్పొరేషన్లకు సంబంధిం చి నామినేటెడ్ పోస్టుల భర్తీని ఈ నెలాఖరున పూర్తి చేయాలని నిర్ణయం తీసుకు న్నారు. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు సమావేశమైన నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించారు.
అంతకు ముందు కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీ సీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో పలు మార్లు సమావేశమై ఆశావాహుల జాబితాను వడపోశారు. పార్టీలో మొదటి నుం చి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 36 మందికి వివిధ కార్పొరేషన్ల పదవులిచ్చారు. ఆ తర్వాత మరికొందరికి అవకా శం కల్పించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా, పూర్తిస్థాయిలో నామి నేటెడ్ పోస్టులు భర్తీ చేయడం లేదని ఆశావాహులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.






