సీపీఎస్ హామీని నిలబెట్టుకోవాలి
- లేకుంటే తమిళనాడు, కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం
- సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): తమిళనాడు, కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదనను చాటిచెప్పాయని సీపీఎస్ ఉద్యో గుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. టీవీకే పార్టీ, కేరళంలోని యూడీఎఫ్ సాధించిన అద్భుత విజ యం వెనుక ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ప్ర కటించిన సీపీఎస్ రద్దు-పాత పెన్షన్ పునరుద్ధరణ హామీ ప్రధాన పాత్ర పోషించిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ రెండు రాష్ట్రాల్లో పో లైన పోస్టల్ ఓట్లే గెలుపు గుర్రాలుగా నిలిచాయని పేర్కొన్నారు. కీలక స్థానా ల్లో ప్రభుత్వ ఉద్యోగులు మార్పువైపు చూపడం గమనార్హమన్నారు. తమ వృద్ధాప్య భద్రత కోసం ఉద్యోగులిచ్చిన తీర్పుగా చూడాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పాతపెన్షన్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు.






