8 July, 2026 | 11:49 AM

మొలకెత్తని సోయా విత్తనం.. రైతన్నలపై కంపెనీలదే పెత్తనం

08-07-2026 10:54 AM

పరిహారం కోసం వెళితే పట్టించుకునే వారు లేరు

బోథ్, జులై 8(విజయక్రాంతి): అసలే వర్షాలు అంతంత మాత్రం ఆపైన నకిలీ విత్తనాలతో(fake seeds) రైతన్నకు పంట పెట్టుబడి మోయలేని భారంగా మారింది. వర్షాలు కురవడంతోటే రైతులు ఎంతో ఆశగా సోయాబీన్ విత్తనాలు నాటారు అయితే నకిలీ విత్తనాలు అంటగట్టిన కంపెనీ వల్ల పంట మొలకెత్తగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

27 మంది రైతులకు పొలాల్లో మొలకెత్తిన విత్తనం

బోత్ మండలం లోని పలు గ్రామాలలో తేజస్వి ని కంపెనీ వారు సరఫరా చేసిన సోయాబీన్ విత్తనాలు(Soybean seeds) మొలకత్తలేదు 27 మంది రైతులు వేసిన 73 ఎకరాలలో తేజస్విని విత్తనం మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళనకు గురై సంబంధిత విత్తన డీలర్ వద్దకు పరిగెత్తారు అయితే విక్రయించిన డీలరు కంపెనీ వారికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మొలకెత్తిన సోయా పంట భూములను పరిశీలించారు అంతేగాక కొంతమంది రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు(Agriculture Department) ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో వ్యవసాయ అధికారులు సహితం పంటను పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులకు తగు నివేదిక అందించారు.

నష్టపోయిన రైతులకు విత్తనాలు ఇప్పిస్తున్నాం ఏవో

విత్తనాలు మొలకెత్తక పోవడంతో తమ దృష్టికి తీసుకువచ్చిన రైతులకు విత్తనాలను ఇప్పిస్తున్నామని ఏఓ రవితేజ తెలిపారు. రైతులు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు అన్నారు. అయితే జులై 15 వరకు విత్తనాలు విత్తెందుకు అవకాశం ఉందని తెలిపారు. ఏది ఏమైనా సోయా విత్తనాలు మొలకెత్తని రైతులకు పంట నష్టపరిహారం ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉందని ఏఓ పేర్కొన్నారు.