6 May, 2026 | 3:15 AM

శాంతినగర్‌లో సేవా భావం

06-05-2026 02:05 AM

కల్లూరు, మే 5 (విజయక్రాంతి): శాంతినగర్కు చెందిన మాజీ వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొలేటి వెంకట కృష్ణకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లేందుకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే వెంకటేశ్వర్లు గత 15 సంవత్సరాలుగా ప్రజా సేవలో కొనసాగుతూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన సేవలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.