8 July, 2026 | 11:24 AM

మృతుని కుటుంబానికి రూ.80 ల‌క్ష‌ల చెక్కు పంపిణీ !

08-07-2026 10:13 AM

ఫ‌లించిన సీఐటీయు కృషి 

గుమ్మడిదల: మైత్రి ల్యాబ్స్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు ఇటీవ‌ల మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ విషయమై సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే.రాజయ్య ప్రత్యేక చొరవ తీసుకొని పరిశ్రమ యాజమాన్యంతో కుటుంబానికి పరిహారం విషయంలో సంప్రదింపులు జరిపి చిట్టచివరకు 80 లక్షల ప‌రిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తల్లికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయగా పరిశ్రమ యాజమాన్యం ఒప్పుకొని సిఐటియు కే రాజయ్య, నాగభూషణం, కమ్మరి రవీందర్ చారి, శ్రీధర్ రావుల సమక్షంలో పరిశ్రమ యాజమాన్యం సిహెచ్ నాగ రాకేష్, ఏకే రాంప్రసాద్, ఎన్ శ్రీనివాసరావు, పి కుమార్, ఇ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ బాలకృష్ణ,లు కలిసి చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మృతుని తల్లి గడ్డమీది నిర్మల, చెల్లెలు గడ్డమీది మౌనిక, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.