8 July, 2026 | 12:44 PM

అట్టడుగు వర్గాల అభ్యున్నతి వైయస్ కృషి

08-07-2026 11:33 AM

బోథ్, జూలై8(విజయక్రాంతి): అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని బూత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న లు పేర్కొన్నారు. బుధవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని మార్కెట్ కమిటీ ఆవరణలో జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద పిల్లల చదువుల కోసం ఎంతగానో కృషి చేశారన్నారు ఫీజు రీయంబర్స్మెంట్ వల్ల ఎంతోమంది పేదల పిల్లలు ఉన్నతులుగా ఎదిగారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు వైద్యం అందే విధంగా చూశారన్నారు కార్యక్రమంలో డైరెక్టర్ షేక్ యూసఫ్ మహమ్మద్ అబ్రా నాయకులు షమేందర్ రెడ్డి మహమ్మద్ కౌసర్ తింటూ లింగంపల్లి మునేష్ తదితరులు పాల్గొన్నారు