24 August, 2026 | 10:22 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

కూసుమంచి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

08-07-2026 10:57 AM

కూసుమంచి, జులై 8(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి(YSR birth anniversary celebrations) వేడుకలను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూసుమంచి  క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు  జొన్నలగడ్డ రవి కుమార్, కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండ కృష్ణవేణి మహిపాల్,  పాలేరు గ్రామ సర్పంచ్ బాలాజీ, పోటు  లెనిన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొక్క ఉపేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొండ శ్రీనివాసరావు, ఎండి కలీం, మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం, తేజావత్ శ్రీనివాస్ నాయక్, తిరుమల రావు, వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండపర్తి సురేష్, తాళ్లూరి శేఖర్, రామ్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు