లయన్స్ క్లబ్ సేవలు ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తాం
లయన్స్ క్లబ్ నేరేడుచర్ల సభ్యులు.
నేరేడుచర్ల,జూలై 08(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో, క్లబ్ అధ్యక్షులు లయన్ షేక్ యూసుఫ్ అధ్యక్షతన, క్లబ్ కోశాధికారి లయన్ బండావత్ సైదులు నాయక్,కుమారుడు చిరంజీవి బండావత్ మణితేజ్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మందికి అల్పాహార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సేవలను సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి శుభసందర్భాల్లో అవసరమైన వారికి ఆహారం అందించడం ద్వారా సంతోషాన్ని పంచుకోవడంతో పాటు మానసిక సంతృప్తి, ఆనందం కలుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్లు బట్టు మధు, చల్లా ప్రభాకర్ రెడ్డి,క్లబ్ ప్రధాన కార్యదర్శి లయన్ సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, మూలగుండ్ల వెంకటరెడ్డి, పూర్వాధ్యక్షులు జిలకర రామస్వామి, జీఎంటీ లయన్ లాయర్ విశ్వనాథ్, సీనియర్ సభ్యులు సూరిబాబు, బాల వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ గౌడ్, రూప బాలు, మహేందర్, గంధం శావయ్య తదితరులు పాల్గొన్నారు.






