8 July, 2026 | 12:44 PM

ఉగ్ర నెట్‌వర్క్‌పై నిఘా.. విజయవాడలో NIA సోదాలు

08-07-2026 11:25 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) విజయవాడ వించిపేటలో మరోసారి ఎన్ఐఏ(National Investigation Agency) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్ర లింక్స్ కేసులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి విచిపేటలో సోదాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఎన్ఐఏ విస్తృత సోదాలు చేసింది.

ఈ ఏడాది మార్చి, మే నెలల్లో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు ముగ్గిరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సొహైల్ బేగ్, మహమ్మద్ రహంతుల్లాను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్ర నెట్‌వర్క్‌ కేసు ఇటీవల ఎన్ఐఏకు బదిలీ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి విజయవాడలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ముగ్గురికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయడంతో విజయవాడలో ఉగ్రకలకలం రేగింది.